Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యంగా ‘టీచ్ ఫర్ చేంజ్’ (Teach For Change) సంస్థ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా చౌటకూరులోని ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసింది. సోమవారం రోజున సదరు పాఠశాలను సందర్శించిన సంస్థ చైర్‌పర్సన్, సినీనటి మంచు లక్ష్మి ఈ స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను వైభవంగా ప్రారంభించారు.
Read Also : School Holidays: నవంబర్‌లో స్కూల్ విద్యార్థులకు పండగే పండగ.. 13 రోజుల వరకు సెలవులు!

Manchu Lakshmi: 48 ప్రభుత్వ పాఠశాలల దత్తత: నాణ్యమైన విద్యా వాతావరణం
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వ పాఠశాలలే వేదిక కావాలని ఆకాంక్షించారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 ప్రభుత్వ పాఠశాలలను తమ సంస్థ దత్తత తీసుకుందని ఆమె వివరించారు. దత్తత తీసుకున్న బడుల్లో విద్యార్థులను విశేషంగా ఆకట్టుకునేలా తరగతి గదుల గోడలకు రంగురంగుల పెయింటింగ్స్ వేయించడంతో పాటు, నేలపై విదేశీ తరహా ప్రత్యేక మ్యాటింగ్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఆడియో-వీడియో బోధనతో మెరుగైన నైపుణ్యాలు
పిల్లలు పాఠాలను శ్రద్ధగా వినడమే కాకుండా సులభంగా అర్థం చేసుకునేలా ఆడియో, వీడియో పద్ధతిలో బోధన అందించేందుకు పెద్ద స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు వంటి సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా నైపుణ్యాలు, ఫోనిక్స్ (Phonics), రీడింగ్ సామర్థ్యాలను పెంపొందించడంపై తమ ట్రస్ట్ ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా పోటీపడేలా రూపురేఖలు
ప్రతి సంవత్సరం వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకుని దత్తత తీసుకోవడం ద్వారా స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. ఈ డిజిటల్ విద్య ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా పోటీపడగలరనే ధీమా ఉంది. ముఖ్యంగా సర్కారు బడుల్లో చదివే ప్రతి ఆడపిల్ల ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. మంచు లక్ష్మి, చైర్‌పర్సన్, టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామానికి చెందిన ప్రముఖులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :