Lalu Prasad Yadav grandson: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లాలు కుమార్తె రోహిణీ ఆచార్య పెద్ద కుమారుడైన ఆదిత్య సింగపూర్ సైన్యంలో శిక్షణకు చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి సైనిక మార్గాన్ని ఎంచుకోవడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మిలిటరీ యూనిఫాంలో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. 18 ఏళ్ల ఆదిత్య సింగపూర్‌లో రెండేళ్ల పాటు సాగే బెసిక్ మిలిటరీ ట్రైనింగ్‌లో చేరినట్లు రోహిణీ ఆచార్య సోషల్ మీడియాలో వెల్లడించారు. తన కుమారుడిపై గర్వంతో నిండిన హృదయంతో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
సాధారణంగా రాజకీయ కుటుంబాల యువత రాజకీయాల్లో అడుగుపెడుతుంటారు. కానీ ఆదిత్య మాత్రం భిన్నమైన మార్గాన్ని (Lalu Prasad Yadav grandson) ఎంచుకుని సైనిక శిక్షణకు వెళ్లడం ప్రశంసనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. “నా కుమారుడిని చూసి గర్వంగా ఉంది. చదువు పూర్తయ్యాక కేవలం 18 ఏళ్ల వయసులోనే కఠినమైన సైనిక శిక్షణకు వెళ్లాడు. ధైర్యంగా ముందుకు సాగాలి” అని రోహిణీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆదిత్య సింగపూర్‌లో శిక్షణ పొందడానికి అక్కడి చట్టాలు ప్రధాన కారణం. సింగపూర్ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి పురుష పౌరుడు లేదా రెండో తరం పర్మనెంట్ రెసిడెంట్ రెండేళ్ల పాటు జాతీయ సేవ చేయాల్సి ఉంటుంది. రోహిణీ కుటుంబం చాలా కాలంగా సింగపూర్‌లో నివసించడంతో, ఈ నిబంధనల మేరకు ఆదిత్య మిలిటరీ ట్రైనింగ్‌లో చేరారు.
ఈ శిక్షణలో కఠినమైన వ్యాయామాలు, ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, టీమ్ వర్క్ వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత వారు రిజర్వ్ దళాల్లో సేవలందించాల్సి ఉంటుంది. ఆదిత్య సైనిక దుస్తుల్లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆర్జేడీ శ్రేణులు, లాలు అభిమానులు అతడి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: