हिन्दी | Epaper

Kuldeep Yadav: వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

Saritha
Kuldeep Yadav: వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

Kuldeep Yadav: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. 2024లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

Read Also: Shoaib Akhtar comments : గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

Kuldeep Yadav: వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌
Kuldeep Yadav: World Cup Victory..Indian cricketer to get married

చిన్ననాటి స్నేహితురాలితో వివాహం

టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ నెల మార్చి 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం 2025 జూన్ 4న లక్నోలో జరిగిన విషయం తెలిసిందే.

కుల్దీప్ కాబోయే భార్య వంశిక, కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ నివాసి. ఆమె ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన వీరిద్దరి బంధం ప్రేమగా మారింది. వివాహం అనంతరం ఈ నెల‌ 17న లక్నోలోని సెంట్రమ్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ యాదవ్, ఈ వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా స్వయంగా ఆహ్వానించారు. వివాహానికి ఒక రోజు ముందు, మార్చి 13న ముస్సోరిలోని ఓ రిసార్టులో మెహందీ, హల్దీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

📢 For Advertisement Booking: 98481 12870