India Iran relations : భారత్–ఇరాన్ సంబంధాలపై ఇరాన్ సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి చెందిన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య బంధం వందల కాదు… వేల సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే భారత్–ఇరాన్ స్నేహానికి పునాదిగా నిలిచాయని అన్నారు.
భారత్ భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై పూర్తి విశ్వాసం ఉందని అబ్దుల్ మాజిద్ తెలిపారు. భారత్‌తో మంచి సంబంధాలు, పరస్పర సహకారం కొనసాగాలని ఖమేనీ కోరుకుంటున్నారని చెప్పారు. ఇతర దేశాలు విధించే ఆంక్షలు భారత్‌ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని, ఇరుదేశాల మధ్య సంబంధాలు దాదాపు మూడు వేల ఏళ్ల చరిత్ర కలవని గుర్తు చేశారు.
Read Also: Manoj Tiwary: కెప్టెన్ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి

ప్రాచీన కాలంలో భారత తాత్విక గ్రంథాలు ఇరాన్లో (India Iran relations) విస్తృతంగా ఉపయోగించేవారని, నేటికీ తమ విశ్వవిద్యాలయాల్లో గణితం, ఖగోళశాస్త్రం, వైద్య విద్య వంటి విభాగాల్లో అధ్యయనం కొనసాగుతోందని వెల్లడించారు. అదే సమయంలో కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌పై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఆంక్షలు విధిస్తున్నాయని విమర్శించారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో ఇరాన్‌పై వచ్చిన తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేయడంపై ఇరాన్ రాయబారి సంతృప్తి వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: