JEE Main Session 2 Date: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 రెండో విడత (సెషన్ 2) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 లోపు తమ రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also: Job Notifications 2026: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 46 పోస్టులు

ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు నిర్వహించనుంది. ఇప్పటికే జనవరి 29వ తేదీతో ముగిసిన మొదటి విడత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ (Answer Key) మరియు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఒకవేళ ఈ ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే, వారు ఫిబ్రవరి 6వ తేదీ లోపు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. మొదటి విడత పరీక్ష రాసిన విద్యార్థులు సైతం తమ స్కోరును మరింత మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో సెషన్-2కు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: