హైదరాబాద్‌లో కుక్కల ఉపద్రవం పెరుగుతూనే ఉంది. వీధుల్లో ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఒక్కరోజులోనే సుమారు 300 మంది కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శిస్తున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Dog bite panic
కేసులు భయంకర స్థాయిలో
ఐపీఎం నారాయణగూడ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో కుక్కకాటు కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికీ నగరంలో కేసుల
Read also: DK Sivakumar: బెంగళూరుతో హైదరాబాద్ పోటీపెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
ఫీవర్ ఆస్పత్రి రికార్డులు
- 2023లో చికిత్స పొందిన వారు: 27,172 | మరణాలు: 13
- 2024లో చికిత్స పొందిన వారు: 29,054 | మరణాలు: 16
- 2025లో ఇప్పటివరకు చికిత్స పొందిన వారు: 24,705 | మరణాలు: 34
- రోజూ 60–80 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి
- ప్రతి ఏడాది దాదాపు 20,000 మంది యాంటీ రేబీస్ టీకాలు వేయించుకుంటున్నారు
ఇతర ఆస్పత్రుల్లో పరిస్థితి
- ఐపీఎం నారాయణగూడలో ఈ ఏడాది 33,765 మందికి టీకాలు
- హయత్‌నగర్ ఆస్పత్రిలో నెలకు 400 కేసులు
- వనస్థలిపురం ఆస్పత్రిలో నెలకు 275–300 కేసులు
- శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, షాపూర్ నగర్, సూరారం ప్రాంతాల్లో రోజుకు 5–10 కేసులు
- పట్టణ PHCలలో రోజుకు కనీసం 10 కేసులు నమోదు
కుక్క కరిస్తే వెంటనే చేయాల్సినవి
- గాయం అయిన ప్రదేశాన్ని సబ్బుతో, శుభ్రమైన నీటితో బాగా కడగాలి
- వెంటనే TT ఇంజెక్షన్ వేయించుకోవాలి
- ఆ వెంటనే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ARV) తీసుకోవాలి
- తీవ్రతను బట్టి 48 గంటల్లో Rabies Immunoglobulin (RIG) తీసుకోవాలి
చేయకూడని పనులు
- గాయం మీద కారం, పసుపు లేదా నాటు మందులు వేయరాదు
- ఆయింట్‌మెంట్లు, నూనెలు రాయడం మానుకోండి
- చిట్కాలు, నాటు వైద్యం మీద ఆధారపడొద్దు
రేబిస్ లక్షణాలు (మనుషుల్లో)
- రెండు వైపులా లాలాజలం కారడం
- తీవ్రమైన చిరాకు లేదా అసహనం
- నీరు చూసినా భయం (హైడ్రోఫోబియా)
- వెలుగు పట్ల భయం (ఫోటోఫోబియా)
- గాలి తగిలినా అసౌకర్యం (ఎయిర్ ఫోబియా)
రేబిస్ (Rabies) సోకితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కుక్కకాటు జరగగానే ఆలస్యం చేయకుండా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: