రాజస్థాన్‌లోని(Rajasthan) కుచామన్ నగరంలో జరిగిన ఒక పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మనోజ్ బర్వాల్ తన కూతురు సోను వివాహానికి అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రిటర్న్ గిఫ్ట్ అందించారు. సాధారణంగా పెళ్లిళ్లలో స్వీట్లు, బహుమతులు, చిన్న కీట్లు ఇచ్చినా, ఇక్కడ మాత్రం రోడ్డుప్రమాదాలపై అవగాహన కల్పించే దిశగా అసలు ఊహించని పద్ధతిని అవలంబించారు. తండ్రి మనోజ్ బర్వాల్ తన కుమార్తె వివాహాన్ని ఒక సందేశంతో గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతో మొత్తం 286 మంది అతిథులకు హెల్మెట్లు( Helmet Wedding) పంపిణీ చేశారు. ఈ విభిన్నమైన కానుకను అందుకున్నవారి ముఖాల్లో ఆశ్చర్యంతో పాటు ప్రశంసలు కనబడాయి. రోడ్డు భద్రత పట్ల సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఈ చర్యను నెటిజన్లు ఘనంగా అభినందిస్తున్నారు.
Read also: School Holidays: డిసెంబర్ హాలిడే నోటిఫికేషన్

రోడ్డు భద్రతపై విసిరిన సందేశం
ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా హెల్మెట్ వాడకంపై ప్రజలు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెళ్లి వంటి ఆనందకర వేడుకలో హెల్మెట్లను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. అతిథులకు హెల్మెట్లు అందించినప్పుడు, “ఒక్క హెల్మెట్ ప్రాణాన్ని కాపాడగలదు” అనే సందేశాన్ని కూడా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది ఈ ఆలోచన తమను ఎంతో ప్రభావితం చేసిందని, ఇలాంటి సామాజిక బాధ్యత కలిగిన చర్యలు మరింత పెరగాలని అభిప్రాయపడ్డారు.
SMలో ప్రశంసల వెల్లువ
ఈ హెల్మెట్( Helmet Wedding) గిఫ్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్న వెంటనే వైరల్ అయ్యాయి. నెటిజన్లు “ఇది నిజమైన అవగాహన”, “ప్రతి పెళ్లి ఇలాగే ఒక మంచి సందేశాన్ని పంచాలి”, “సేఫ్టీకి ఇచ్చిన ప్రాధాన్యత అద్భుతం” వంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఈ ఘటన సమాజానికి కూడా ఒక స్ఫూర్తి, ముఖ్యంగా యువతకు రోడ్డు భద్రత ప్రాధాన్యతను గుర్తు చేసే ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.
హెల్మెట్లు ఎంతమందికి ఇవ్వబడాయి?
మొత్తం 286 మంది అతిథులకు హెల్మెట్లు అందించారు.
ఈ వివాహం ఎక్కడ జరిగింది?
రాజస్థాన్‌లోని కుచామన్ నగరంలో.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/