బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో డ్రగ్(Drugs) ట్రాఫికింగ్ గ్యాంగ్‌లపై భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 2,500 మంది పోలీసులు, సైనిక జవాన్లు పాల్గొన్నారు. దాదాపు 60 మంది అనుమానితులను కాల్చివేయగా, 81 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు.
Read Also: Montha: తీర రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. సాయంపై హామీ

ఈ క్రమంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున 93 రైఫిల్స్, 500 కిలోల డ్రగ్స్, వాహనాలు, గ్యాంగ్ పరికరాలు(Drugs) స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మర్‌డ్ వాహనాలు కూడా వినియోగించారు.
ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్(United Nations Human Rights Office) తీవ్రంగా స్పందించింది. పోలీస్ చర్యల్లో అధిక హింస చోటుచేసుకుందని పేర్కొంటూ, స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. బ్రెజిల్‌లో ఇటీవలి కాలంలో డ్రగ్ మాఫియాల దాడులు, గ్యాంగ్ యుద్ధాలు పెరగడంతో ప్రభుత్వం ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది. రియో ప్రాంతం డ్రగ్ అక్రమ రవాణాకు కేంద్రంగా మారడంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: