हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Digital Governance: ఏపీలో 25 మున్సిపల్ సేవలు ఆన్‌లైన్‌లోకి

Pooja
Digital Governance: ఏపీలో 25 మున్సిపల్ సేవలు ఆన్‌లైన్‌లోకి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన 25 రకాల సేవలను ఆన్‌లైన్‌లో(Digital Governance) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇకపై ప్రజలు ఇంటి నుంచే మున్సిపల్ సేవలను సులువుగా పొందవచ్చు.

Read Also:Andhra Pradesh: నేడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

Digital Governance

మ్యారేజ్ సర్టిఫికేట్ సహా కీలక సేవలు ఒకే చోట

ఈ కొత్త పోర్టల్ ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్, ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్స్, మ్యూటేషన్ వంటి అనేక ముఖ్యమైన సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఇప్పటివరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేయవచ్చు.

ప్రభుత్వం ప్రతి సేవకు నిర్దిష్ట గడువును కూడా ఖరారు చేసింది.

  • మ్యారేజ్ సర్టిఫికేట్: 3 రోజుల్లో
  • ట్రేడ్ లైసెన్స్: 7 రోజుల్లో
  • ఆస్తి పన్ను సంబంధిత సేవలు: 15 రోజుల్లో

సర్టిఫికేట్ జారీ ఆలస్యం అయితే లేదా దరఖాస్తు తిరస్కరించినా కారణాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. గడువులోగా దరఖాస్తులు పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాట్సప్ గవర్నెన్స్‌తో ఇప్పటికే అనేక సేవలు

పాలనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్న(Digital Governance) కూటమి ప్రభుత్వం ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ సేవలను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఆదాయ, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆర్టీసీ టికెట్లు, దేవాలయ దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక వెబ్‌సైట్ల అవసరం లేకుండా అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సప్ గవర్నెన్స్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

వాట్సప్ గవర్నెన్స్ ఉపయోగించాలంటే:
9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపితే సేవలు ప్రారంభమవుతాయి.

ఆన్‌లైన్‌లో మున్సిపల్ సేవలు ఎలా పొందాలి?

  • cdma.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
  • Fingertips’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
  • Online Services’ ఎంపికను ఎంచుకోవాలి
  • అవసరమైన సేవను సెలెక్ట్ చేయాలి
  • మీ నగరం / పట్టణాన్ని ఎంపిక చేసుకోవాలి
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
  • దరఖాస్తు మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కు వెళ్తుంది
  • అధికారులు పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తారు

పారదర్శకత, వేగమే లక్ష్యం

దరఖాస్తుల పరిశీలన, సర్టిఫికేట్ల జారీ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మున్సిపల్ సేవలన్నీ ఆన్‌లైన్‌లోకి రావడంతో ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా కానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సేవలను కూడా ఈ వ్యవస్థలో చేర్చనున్నట్లు సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870