De De Pyaar De 2 OTT release : అజయ్ దేవగన్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ సినిమా ‘డీ డీ ప్యార్ డే 2’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నవంబర్ 14, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ‘డీ డీ ప్యార్ డే’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే మొదటి భాగం సాధించిన బాక్సాఫీస్ విజయాన్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
అంశుల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి (De De Pyaar De 2 OTT release) సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ IMDbలో 7.8/10 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ విడుదలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
తాజా సమాచారం ప్రకారం ‘డీ డీ ప్యార్ డే 2’ సినిమా జనవరి 9, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ విభాగంలో లిస్ట్ అయ్యింది. దీంతో థియేటర్‌లో మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే ఓటీటీ ప్రేమికులు ఈ రొమాంటిక్ కామెడీని ఇంట్లోనే వీక్షించే అవకాశం పొందనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: