మీ బైక్ లేదా కారుపై పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్లు(Challans) చెల్లించడానికి ఇబ్బందిపడుతున్నవారికి శుభవార్త. కర్నాటక ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం రాయితీని ప్రకటించింది. అంటే, వాహనదారులు ఇప్పటివరకు ఉన్న చలాన్లలో కేవలం సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేక రాయితీ నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చి, డిసెంబర్ 12 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: Cyber Crime: సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్

జరిమానాలపైనే వర్తిస్తుందని
1991–1992 నుంచి 2019–2020 మధ్య ఆర్టీఓ(RTO) మరియు ట్రాఫిక్ పోలీస్ విభాగాలు జారీ చేసిన పాత ఈ-చలాన్లన్నిటికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ రాయితీ కేవలం జరిమానాలపైనే వర్తిస్తుందని, వాహన పన్ను బకాయిలను మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెండింగ్ ఫైన్లను క్లియర్ చేసుకోవడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, బెంగళూరు(Bengaluru) వన్ సెంటర్లు లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఆర్టీఓ కేసుల కోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్(Traffic) నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు పడిన వాహనదారులకు ఇది మరోసారి పెద్ద ఊరటగా భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: