Bomb Threat: హైదరాబాద్లోని బేగంపేట వాతావరణ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం లోపు కార్యాలయ ప్రాంగణంలో సుమారు 14 బాంబులు పేలుతాయంటూ అధికారులకు ఒక ఈమెయిల్ అందింది. ఈ హెచ్చరికతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Read Also : Jagtial crime: కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి

పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు
వెంటనే రంగంలోకి దిగిన బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), వాతావరణ కేంద్రంలోని ప్రధాన భవనం మరియు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ కేవలం ఒక ఆగంతకుడి ఆకతాయి చర్య (Hoax Call) అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :