Bank Transaction Limits: బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు చేయడం లేదా పెద్ద మొత్తాల్లో లావాదేవీలు చేయడం చాలా మందికి సాధారణం అయిపోయింది. కానీ ఈ విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే Income Tax (IT) విభాగం దృష్టికి వచ్చే అవకాశం ఖాయం అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ లావాదేవీ సేఫ్, ఏది రిపోర్ట్ చేయాల్సినది అనే విషయాలను క్లియర్‌గా తెలుసుకోవడం తప్పనిసరి.
Read also: Gujarat Crime: పెళ్లికూతురి ని హత్య చేసిన పెళ్ళికొడుకు

ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో మొత్తం డిపాజిట్ ₹10 లక్షలను దాటి పోతే, ఆ సమాచారం IT విభాగానికి ఆటోమేటిక్‌గా చేరుతుంది. కరెంట్ ఖాతాలకు ఈ పరిమితి మరింత ఎక్కువ. కరెంట్ అకౌంట్‌లో ₹50 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేస్తే, బ్యాంక్ తప్పనిసరిగా ITకు రిపోర్ట్ చేయాలి. ఈ రిపోర్ట్‌లు Annual Information Statement (AIS)లో కూడా చేరి, తరువాత విచారణకు దారితీసే అవకాశం ఉంటుంది.
నగదు లావాదేవీలకు కఠిన నిబంధనలు
నగదుతో చేసే ట్రాన్సాక్షన్లపైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల కంటే ఎక్కువ తీసుకోవడం చట్టపరంగా నిషేధం. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానా పడే అవకాశం ఉంది. FDల విషయానికొస్తే, ₹10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ ITకు సమాచారం పంపుతుంది. ఆదాయం, మూలం స్పష్టంగా ఉండాలి. లేనిపక్షంలో వ్యత్యాసాలను IT అధికారి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ కొనుగోళ్లలో కూడా పెద్ద మొత్తాల కారణంగా IT దృష్టి ఎక్కువగా ఉంటుంది. నగదు లేదా ఆన్‌లైన్ మొత్తాల కలిపి ₹30 లక్షలకు మించితే డీల్‌పై స్క్రూటినీ వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు సంవత్సరానికి ₹10 లక్షలను మించి చెల్లిస్తే, ఆ సమాచారమూ IT విభాగానికి వెళ్తుంది.
ఆర్థిక పారదర్శకత ఎందుకు ముఖ్యం?
Bank Transaction Limits: భారీ మొత్తాలు బ్యాంకుల్లో తిరుగుతున్నప్పుడు ప్రభుత్వం డబ్బు ప్రవాహం పారదర్శకంగా ఉందా అని పరిశీలిస్తుంది. ఆదాయం–వ్యయం సరిపోలనప్పుడు IT పరిశీలనలు ప్రారంభం కావచ్చు. అందుకే ప్రతి పెద్ద లావాదేవీకి సరైన రికార్డులు, ఆదాయం ఆధారాలు ఉంచుకోవడం తప్పనిసరిగా అవసరం.
సేవింగ్స్ ఖాతాలో ఎంత వరకు డిపాజిట్ సేఫ్?
₹10 లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒక వ్యక్తి నుంచి ఎంత వరకు నగదు తీసుకోవచ్చు?
పొత్తంగా ₹2 లక్షలు మాత్రమే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: