వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ : రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం(Atchannaidu) కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు.
Read also: ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం – సిఎం, డిసిఎం చిత్రాలకు పాలాభిషేకం

నాణ్యమైన విత్తనాల కోసం చర్యలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన(Atchannaidu) తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతి కతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయ కంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: