తిరుపతిలోని సిద్ధ వైద్య పరిశోధన విభాగంలో జాతీయ 9వ సిద్ధ దినోత్సవ వేడుకలు
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) అనుబంధంగా వున్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్ ఆవరణలోని సిద్ద క్లినిక్ రీసెర్చ్ యూనిట్ తిరుపతి వారి ఆధ్వర్యంలో 9వ సిద్ధ జాతీయ దినోత్సవం మంగళవారం నిర్వహించారు.
Read also: Tirupati: దేశంలో ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఖూనీ చేస్తోంది
తిరుపతి సిద్ధ ఇన్చార్జ్ డా॥ సామ్రాజ్ మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా జనవరి 6వ తేదిన సిద్ద వైద్య పితామహుడైన సిద్దార్ అగస్యర్ జన్మదినం పురస్కరించుకొని వేడుకను నిర్వహించమని, థీమ్ గ్లోబర్ హెల్త్ కోసం సిద్ధ అని తెలిపారు. సిద్ధ వైద్య విధానం వ్యాధి నివారణ మరియు ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధులను నివారించడానికి ఆహారాన్ని ఔషధంగా ఉపయోగించడంపై దృష్టిని సారిస్తూ సిద్ధ ఆహార్ (సాంప్రదాయ సిద్ధ ఆహార భావనలు) ప్రజలలో ప్రచారం చేయబడుతుందని పేర్కొన్నారు.

ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన మందార టీని ఆహారపు అలవాట్లపై అవగాహనలో భాగంగా ప్రజలకు పంపిణీ చేశారు. సిద్ధ వర్మ చికిత్స, దాని సూత్రాలు మరియు వైద్య ప్రాముఖ్యతపై విద్యా సెషన్లు నిర్వహించామన్నారు. అలాగే సిద్ద మెడికల్ క్యాంపులు ప్రతి నెల నిర్వహిస్తున్నామని దీనికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. ఎళ్లవేళల మాకు సహాయ సహకారాలు అందిస్తున్నా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్ , వివిధ విభాగాధిపతులకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నమన్నారు.
సిద్ధ వైద్యం పాత్ర
స్విమ్స్ డైరెక్టర్-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ మాట్లాడుతూ… సమగ్ర ఆరోగ్య సంరక్షణలో సిద్ధ వైద్యం పాత్రను వివరించారు. సిద్ధ వైద్యం యొక్క ముఖ్య లక్షణాలలో ములికలు, ములిక లోహ మిశ్రమాలు, బహ్య చికిత్సలు, వర్మం, యోగా, ఆహార నియమాలు (సిద్ధ ఆహార్) మరియు జీవనశైలి మార్పుల వలన ఆరోగ్యంగా వుంటారని తెలిపారు.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్వేత మాజీ డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు అదే రోజు సిద్ధ యూనిట్ను సందర్శించి, పేషంట్లతో సంభాషించారు. ఈ సందర్భంగా సిద్ధ క్లినిక్ యూనిట్ వలన పేషంటకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: