రాష్ట్ర ఐటీ,(AP) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఈ రోజు మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు చదువు మాత్రమే కాదు, మానవతా విలువలు కూడా అత్యంత ముఖ్యమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, అందుకు నా ఉపాధ్యాయులే కారణం,” అని ఆయన చెప్పారు.
Read also: AP Pensions: డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి

డాన్ బాస్కో పాఠశాల సేవలు, సమస్యలపై లోకేశ్ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా,(AP) డాన్ బాస్కో పాఠశాల గురించిన ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. “డాన్ బాస్కో అనేది ప్రేమ, సేవ, కరుణా ప్రతీక,” అని అన్నారు. అనాథల కోసం, ఇల్లు లేని వారికి ఆశ్రయాన్ని, ఆకలితో ఉన్నవారికి అన్నం అందిస్తున్న గొప్ప వ్యవస్థగా ఈ పాఠశాల ఉన్నదని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 పాఠశాలల ద్వారా నేరుగా విద్యతో పాటు మానవతా విలువలను అందించడంపై ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో, లోకేశ్ పాఠశాల ఎదుర్కొంటున్న ఎయిడెడ్ వ్యవస్థ రద్దు సమస్యపై స్పందించారు. విద్యాశాఖ మంత్రిగా, ఈ పాఠశాలకు అన్ని విధాలా అండగా నిలబడి, సమస్యల పరిష్కారానికి తన పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. “పాఠశాల, గురువులను ఎప్పుడూ మర్చిపోకూడదు,” అని విద్యార్థులకు సూచించారు. అందరం కలిసి పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తూ, డాన్ బాస్కో పాఠశాలను దేశంలో అద్భుతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :