విజయవాడ : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం రూ.3,380 కోట్ల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణము, మరమ్మతు పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మోలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర రహదారులు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రి రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులతో కలిసి బందరు ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు రహదారులు భవనాలశాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Roads to be constructed at a cost of Rs. 3,380 crore
అనంతరం పాత్రికేయల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్రానికి పలు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు రావడానికి మార్గం సుగమం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,081 కోట్ల రూపాయల వ్యయంతో 16వేల కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరం రూ.3,380 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం పనులు చేపట్టామని, ఇందుకోసం టెండర్లు ఇప్పటికే పిలిచామని, మరికొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయని, మరికొన్ని మొదలయ్యాయనీ చెబుతూ అన్ని కూడా నాణ్యతలో ఏమాత్రం లోటు లేకుండా వచ్చే మే నెల ఆఖరిలోగా పూర్తి చేస్తామన్నారు.
నియోజకవర్గాల వారీగా కేటాయించిన నిధులు
జిల్లాలో 160 కోట్ల రూపాయల వ్యయంతో 1,518 కిలోమీటర్ల మేరకు గుంతలు వడిన రహదారులను పూడ్చటంతో పాటు ఇతర మరమ్మతులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో మచిలీపట్నం నియోజకవర్గంలో 33 కోట్ల రూపాయల వ్యయంతో 166 కిలోమీటర్ల రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే జిల్లాలో రహదారుల మరమ్మతుకు గాను పామర్రు నియోజక వర్గానికి 28 కోట్ల రూపాయలు, గన్నవరం నియోజకవర్గానికి 27 కోట్ల రూపాయలు, గుడివాడ నియోజకవర్గానికి 16 కోట్ల రూపాయలు, అవనిగడ్డ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు, పెనమలూరు నియోజక వర్గానికి 15 కోట్ల రూపాయలు, పెడన నియోజక వర్గానికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఈ నిధులతో పనులు రహదారుల మరమ్మతు పనులు ముమవరంగా ముమ్మరంగా చేపట్టి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
బందరు ఓడరేవు నిర్మాణ పురోగతి
బందరు ఓడరేవు నిర్మాణాన్ని 50 శాతం పైగా పూర్తయిందని, ఇప్పటిదాకా 1760 కోట్ల రూపాయలు ఖర్చు అయినదని, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఇంకా 1700 కోట్ల రూపాయల మేరకు 42 శాతం పని మిగిలి ఉందని ఉందన్నారు. ఇకపై ప్రతినెలా సమీక్షి పని ంచి ఎంత శాతం మేరకు పూర్తయిందో తెలుసుకుంటామన్నారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో. సాంకేతిక పరంగా కొన్ని సమస్యలు వచ్చాయ, ఈ సంవత్సరం జూన్ నెలాఖరికి పూర్తి చేస్తామన్నారు.. ఈ ప్రాంత వాసి హార్బర్ కోసం కృషిచేసిన పూర్వపు మంత్రి నడికుదుటి నరసింహారావు పేరును హార్బర్ కు పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా జారీ చేశారన్నారు. మచిలీపట్నంతో పాటు జిల్లా ప్రజలందరి తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామమన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: