ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.. చైల్డ్ కేర్ లీవ్ వినియోగానికి సంబంధించి పిల్లల వయో పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ (AP) ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. దీంతో ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను.. తమ రిటైర్మెంట్‌లోపు ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు దివ్యాంగ పిల్లల సంరక్షణతో పాటుగా పిల్లల వయసుతో సంబంధం లేకుండా.. వివిధ అవసరాలకు ఈ సెలవు ఉపయోగించుకోవచ్చు.
Read Also: CBN: ఏపీలో కానిస్టేబుల్ నియామకాల్లో కీలక ముందడుగు

జీవో విడుదల
అయితే గతంలో పిల్లల వయసు 18 సంవత్సరాలు దాటితే ఈ సెలవులు ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని తొలగించడంతో పిల్లల అవసరాలు, అనారోగ్యం లేదా ఇతర సమయాల్లో.. సర్వీసు ముగిసే వరకు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావటంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: