ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని సీఎం తెలిపారు. ‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనమే పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకుందాం.
Read Also: YS Jagan: పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్
డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాదులు వేసింది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి’ అంటూ సీఎం చంద్రబాబు సందేశం ఇచ్చారు.
నారా లోకేశ్ సందేశం
‘77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు .
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: