తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti) వేళ ఉత్సాహం మొదలైంది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సంక్రాంతి సెలవుల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 జనవరి 10 నుండి 18 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు పాఠశాలలు మూసివేయబడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయి. అనంతరం జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక తెలంగాణలోనూ సంక్రాంతి సెలవులపై సమాయత్తం కొనసాగుతోంది. జనవరి 10 నుంచి 15 వరకు ఆరు రోజుల సెలవులు ఇవ్వబోతున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుండగా, తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఇప్పటికే పండుగ మూడ్ నెలకొంది.

AP: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు
Read also: Vizag New Definition: వైజాగ్‌కు కొత్త నిర్వచనం చెప్పిన చంద్రబాబు
చంద్రబోస్ జయంతి
ఈ సందర్భంగా చాలా కుటుంబాలు తమ ఊళ్లకు వెళ్లేందుకు ముందస్తుగా రవాణా ఏర్పాట్లు చేసుకుంటుండటంతో బస్సులు, రైళ్లలో బుకింగ్స్ పెరిగాయి. ప్రజల రద్దీ దృష్ట్యా ప్రభుత్వాలు అదనపు సర్వీసులను నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత కూడా జనవరిలో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయి. జనవరి 23న వసంత పంచమి, సుభాస్ చంద్రబోస్ జయంతి, అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు కూడా సెలవులు వర్తిస్తాయి. దీంతో జనవరి నెల మొత్తం విద్యార్థులకు సెలవుల వాతావరణమే నెలకొననుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: