నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజల రక్షణతో పాటు చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. (Annamayya district) ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఇటీవల పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్‌కు భయపడవద్దని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్, సీబీఐ, ఈడీ (ED) అధికారులు అని చెప్పుకుని ఫోన్ చేసే వారు మోసగాళ్లేనని స్పష్టం చేశారు. అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్, జూదాలకు దూరంగా ఉండాలని, అవి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు.
Read also: Anakapalli: రేబిస్ వలన పన్నెండేళ్ల బాలుడు మృతి

ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని హెచ్చరిక
బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన OTPలు, ఏటీఎం నంబర్లు, పిన్‌లు, వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదని తెలిపారు. (Annamayya district) అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని, సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులు, గృహ హింస, చిన్నారులపై నేరాల వంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు పోలీసులతో సమన్వయం పాటిస్తే నేరాలను అరికట్టడం సులభమవుతుందని, భద్రమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: