యూరియా కొరత, ఎరువుల సరఫరాపై ఫిర్యాదులు, వైసిపి ఎంపి రఘునాథ్ రెడ్డికి కేంద్రమంత్రి స్పష్టం
రాజంపేట : రాష్ట్రాల లో ఖరీఫ్, రబీ సీజన్లలో అవసరాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించే నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తుందని కేంద్రమంత్రి స్మాత్ అనుప్రియ పటేల్ స్పష్టం చేశారు. గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడం జరిగిందని తెలియచేశారు. ఆంధ్ర ప్రదేశ్లో (Andhra pradesh) తీవ్రమైన యూరియా కొరత, ఎరువుల సరఫరాపై వైసిపి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాధ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మంగళవారం ప్రస్తావించారు. యూరియా సమస్యపై రాష్ట్రం నుంచి ఐదు ఫిర్యాదులు అందినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2025 -26 రబీ సీజన్ లో రాష్ట్రాల అంతటా యూరియా లభ్యత తగినంతగా ఉందన్నారు. ఎరువులను నిత్యావసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం ముఖ్యమైన వస్తువుగా ప్రకటించారని, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు, 1985 కింద నోటిఫై చేశారని పేర్కొన్నారు. ఈ చట్టం లోని నిబంధనల ప్రకారం బ్లాక్ మార్కెటింగ్, అధిక ధర నిర్ణయించడంలో పాల్గొన్న వ్యక్తుల పై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేశారు.
Read also: AP: జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

Urea supply according to the needs of the states
అయితే గత ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల లభ్యత, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ ద్వారా 5 ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లా స్థాయి లో రాష్ట్రంలో ఎరువుల పంపిణీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కాబట్టి, అవసరమైన చర్య కోసం ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశంలో ఎరువులు సకాలంలో తగినంత లభ్యతను నిర్ధారించడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, రాష్ట్రాల వారీగా, నెలవారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తుందని వివరించారు. క్షేత్ర స్థాయిలో అంచనా వేసిన అవసరాల ఆధారంగా, డిఓఎఫ్ నెలవారీ సరఫరా ప్రణాళికను జారీ చేయడం ద్వారా రాష్ట్రాలకు తగినంత పరిమాణంలో ఎరువులను కేటాయిస్తుందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సబ్సిడీ ఎరువుల కదలికను ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఆన్లైన్ వెబ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ పర్యవేక్షిస్తుందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: