అమరావతిలో(Amaravati) రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెండో విడత లాండ్ పూలింగ్‌కు సంబంధించి త్రిసభ్య కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహించి, రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కసరత్తు చేస్తోంది. ఈ సమీక్షలో, లాండ్ పూలింగ్‌కు ముందుకు రాని రైతుల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించబడ్డాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,(Pemmasani Chandrasekhar) రాజధానిలోని లంక భూముల సమస్య క్లియర్ అయిందని ప్రకటించారు. రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా, గ్రీన్ బఫర్ జోన్ పైన చేసిన చర్చలలో, 36 ఫ్లాట్లు ప్రభావితమయ్యాయని, అయితే దానిని 3 ఫ్లాట్లకు తగ్గించేలా మార్పులు చేసినట్లు పెమ్మసాని వెల్లడించారు. 2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించలేదని, వారితో మరోసారి మాట్లాడేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Read also : సందర్శకులపై ఆంక్షలు.. విచారణ 17కి వాయిదా

భూముల సమస్యలు, సొసైటీ అభివృద్ధి పై చర్చలు
రాజధానిలో(Amaravati) భూముల ఇష్యూ, వాస్తు, ఎఫ్‌ఎస్‌ఐ, రోడ్డు శూల వంటి సమస్యలపై కూడా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. 120 మంది రైతులు ల్యాండ్ ఆల్టర్నేటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కాగా వీరితో కూడా తగిన చర్చలు జరగనున్నాయి. సోమవారం నుండి, 26 గ్రామాల్లో డీపీఆర్ తయారు చేసి, బౌండరీ స్టోన్లను రెండు వైపులా వేయనున్నట్లు చెప్పారు. అలాగే, 18 కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి గ్రామాల అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రామాభివృద్ధి, మరియు అసైన్డ్ ల్యాండ్ సంబంధిత సమస్యలను సమీక్షించే కార్యక్రమాలను సోమవారం తర్వాత నిర్వహించేందుకు నిర్ణయించామని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :