ప్రముఖ మలయాళ నటుడు కన్నన్ పట్టాంబి (Kannan Pattambi), (62) కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కేరళ కోజికోడ్‌లో మరణించారు. మోహన్‌లాల్ పులి మురుగన్(మన్యం పులి), కర్మయోధతో పాటు కాందహార్, ఓడియన్, కురుక్షేత్ర తదితర చిత్రాల్లో ఆయన నటించారు. కన్నన్ సోదరుడు మేజర్ రవి కూడా ఫిల్మ్ డైరెక్టర్. రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా రవి దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన ‘మిషన్ 90 డేస్’ మూవీలోనూ కన్నన్ కనిపించారు.
Read also: Varanasi Release Date: ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

సినీ ప్రస్థానం
నటుడు, ప్రొడక్షన్ కంట్రోలర్ గా, మలయాళం సినీ ఇండస్ట్రీలో కన్నన్ పత్తాంబి (Kannan Pattambi)సేవలందించారు. ప్రొడక్షన్ కంట్రోలర్ గా, 2010లో మోహన్ లాల్ “కందహార్’ చిత్రంతో పాటుగా అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్స్ సినిమాల నిర్వహణలో కన్నన్ పత్తాంబి కీలకంగా పని చేశారు. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ మూవీ “మన్యం పులి” సినిమాకు ఆయన ప్రొడక్షన్ టీమ్ లో భాగంగా ఉన్నారు. కర్మ యోధ, ఒడియన్, 12th మ్యాన్, అనంతభద్రం, కీర్తిచక్ర, వెట్టం, కందహార్, క్రేజీ గోపాలన్ వంటి సినిమాలు చేసి మంచి పేరుతెచ్చుకున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: