ఏసీబీ వలలో వరుసగా ముగ్గురు అధికారులు మొదట ₹5 లక్షల లంచం డిమాండ్.. చివరకు ₹2.5 లక్షలకు డీల్అ డ్వాన్స్‌గా ₹1.5 లక్షలు, మిగతా ₹1 లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్
Nandigama bribery case : రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు సంచలన ఆపరేషన్ నిర్వహించారు. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సంబంధించి లంచం డిమాండ్ చేసిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
స్థానికంగా ఓ వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీడీవో సుమతి కలిసి తొలుత ₹5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడితో చర్చల అనంతరం లంచం మొత్తాన్ని ₹2.5 లక్షలకు తగ్గించారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ₹1.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్న అధికారులు, మిగిలిన ₹1 లక్షను బుధవారం స్వీకరిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఏసీబీ (Nandigama bribery case) డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే దాడులు నిర్వహించి ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, లంచం వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతుల విషయంలో లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: