పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ క్రూర ఘటన చోటుచేసుకుని సంచలనం సృష్టించింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణి, పార్వతీపురం (Parvathipuram Manyam) మండలం బందలుప్పి గ్రామానికి చెందిన రామకృష్ణ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహానంతరం వీరిద్దరూ సాలూరు పట్టణంలోని దుగ్గాన వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు – ఆదిత్య, మహేందర్ ఉన్నారు. కుటుంబాన్ని పోషించేందుకు రామకృష్ణ తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా, త్రివేణి కూలి పనులు చేస్తోంది.ఇటీవలి వర్షాల కారణంగా పనులు లేకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కష్టాల్లో పడింది. ఇల్లు నడిపేందుకు త్రివేణి, రామకృష్ణ ఇద్దరూ ఇబ్బందులు పడుతున్నారు.
మహేందర్ తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని
ఇలాంటి సమయంలో రామకృష్ణ మద్యం కోసం త్రివేణిని డబ్బులు ఇవ్వమని అడిగాడు. అయితే త్రివేణి తన దగ్గర డబ్బులు లేవని నిరాకరించింది. ఈ విషయం చిన్న గొడవగా మొదలై భర్త–భార్య మధ్య ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన రామకృష్ణ ఇంట్లో ఉన్న మిక్సీ వైరు తీసుకొని భార్య మెడకు చుట్టి బిగించి చంపేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు మహేందర్ తల్లి (Mahender’s mother) విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. ఏమి జరిగిందని తండ్రిని అడిగాడు. దీంతో మీ అమ్మ గుండెపోటుతో పడిపోయిందని, గొల్లవీధిలో ఉన్న నీ పెద్దమ్మకు చెప్పి రా అని కొడుకు మహేంద్రని పంపించాడు రామకృష్ణ.

పోలీసులకు ఫిర్యాదు
ఆ తర్వాత కొద్ది సేపట్లోనే త్రివేణిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.విషయం తెలుసుకున్న రామకృష్ణన్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నకొడుకు మహేందర్ ఈ విషయం తన అన్న ఆదిత్యకు ఫోన్ ద్వారా తెలిపి అనంతరం బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: