హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ రోజుల్లోనే వాహనాల రద్దీ కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ (Traffic jam) లు ఏర్పడతాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చిన్న వర్షం పడితే అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోవాల్సి వస్తుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గతంలోనుంచే ప్రభుత్వం నగర అభివృద్ధిపై, రవాణా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అనేక ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం చేపట్టింది. మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో కొత్త ఫ్లైఓవర్లు ప్రారంభమై ట్రాఫిక్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ఇప్పటికే ఉన్న రహదారులు, వంతెనలు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మరోసారి భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరోసారి భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా ఈ భారీ మల్టీలెవల్ ఫ్లైఓవర్ (Multilevel flyover) ని నిర్మించనున్నారు. ఈమార్గం ద్వారా నిత్యం వేలాదిమంది ముంబై, కర్ణాటకలోని పలు ప్రాంతాలతో పాటుగా రాష్ట్రంలోని వికారాబాద్, చేవేళ్ల, శంకర్‌పల్లి, గచ్చిబౌలి వైపు ప్రయాణాలు చేస్తుండటం వల్ల ఈ రూట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో నానల్‌నగర్‌తో పాటు చాలా చోట్ల ఉదయం నుంచి అర్థరాత్రి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడం కోసం రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్‌లలో హెచ్ సిటీ కింద సిగ్నల్ ఫ్రీ జర్నీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బల్దియా ప్లాన్ చేస్తోంది.దీనిలో భాగంగా సరోజినీ దేవీ ఐ హస్పిటల్ నుంచి.. ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా మల్టీలెవర్ ఫ్లైఓర్, గ్రేడ్ సెపరేటర్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. ఇందుకుగాను రూ.398 కోట్ల రూపాయలు కేటాయించనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చే నెల అనగా సెప్టెంబర్ 1-22 వరకు బిడ్లను స్వీకరించనున్నారు. అలానే సెప్టెంబర్ 8న ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: