మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) అధ్యక్ష పదవిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానార్యమన్ సింధియా ఈ పదవికి దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారని సమాచారం. సెప్టెంబర్ 2న ఇండోర్‌లో జరగబోయే MPCA వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.ఈ పదవికి మహానార్యమన్ సింధియా తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడం వల్ల ఆయన ఎన్నిక ఖాయమైంది. దీంతో సింధియా కుటుంబం నుంచి మూడవ తరం వ్యక్తి ఎంపీసీఏ అధ్యక్ష పదవిని చేపట్టనున్న చారిత్రక సందర్భం ఇది.మధ్యప్రదేశ్ క్రికెట్ పరిపాలనలో సింధియా కుటుంబంకు విశేషమైన పాత్ర ఉంది. మహానార్యమన్ తాత మాధవరావు సింధియా, ఆయన తండ్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఇద్దరూ MPCA అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పాటు వ్యవహరించారు. వారి నాయకత్వంలో రాష్ట్ర క్రికెట్ అభివృద్ధి చెందింది.
ఆయనకు గౌరవప్రదమైన అవకాశం మాత్రమే కాకుండా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, యువ క్రికెటర్ల ప్రోత్సాహం, అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు వేదికగా ఇండోర్ హోల్కర్ స్టేడియం రూపుదిద్దుకోవడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి కాలంలో జరిగాయి.ఇప్పుడు మహానార్యమన్ సింధియా ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇది ఆయనకు గౌరవప్రదమైన అవకాశం మాత్రమే కాకుండా, పెద్ద బాధ్యత కూడా.28 ఏళ్ల మహానార్యమన్ రావు సింధియా (Mahanaryaman Rao Scindia) గత కొంతకాలంగా క్రికెట్ పరిపాలనలో చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ లీగ్‌ను ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు మంచి వేదికగా నిలిచింది.

భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఒక తొలి అడుగు
సింధియా కుటుంబానికి క్రీడలు, రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. మాధవరావు సింధియా క్రికెట్ ఆడి ఎంపీసీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. ఆయన అనంతరం జ్యోతిరాదిత్య సింధియా కూడా క్రికెట్ పాలనలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఇప్పుడు వారి బాటలోనే మహానార్యమన్ సింధియా క్రికెట్ పరిపాలనలోకి అడుగుపెట్టారు. ఇది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి ఒక తొలి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నికలు కూడా దాదాపుగా ఖరారయ్యాయి. కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి వినీత్ సేథియా, కార్యదర్శి పదవికి సుధీర్ అస్నాని, కోశాధికారి పదవికి సంజయ్ దువా ఎంపికయ్యారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా రాజీవ్ రిసోద్కర్, ప్రశున్ కన్మదికరణ్, విజయ్స్ రాణా, సంధ్య అగర్వాల్ పేర్లు కూడా ఖరారయ్యాయి. జాయింట్ సెక్రటరీ పదవికి మాత్రం పోటీ ఉండే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: