हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Latest News: Lokesh Kanagaraj హీరోగా లోకేష్ కనగరాజ్.. హీరోయిన్ ఎవరంటే?

Anusha
Latest News: Lokesh Kanagaraj హీరోగా లోకేష్ కనగరాజ్.. హీరోయిన్ ఎవరంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాప్ డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ పేరు ముందువరుసలో నిలుస్తుంది. కేవలం కొద్ది కాలంలోనే ఆయన రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లే, రియలిస్టిక్ టచ్, యాక్షన్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చే స్టైల్‌తో లోకేష్ తన సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించారు.లోకేష్ కనగరాజ్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 2017లో సందీప్ కిషన్ హీరోగా నటించిన “నగరం” (Nagaram) సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా “ఖైదీ”. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, పాటలు లేకుండా, ఒకే రాత్రి నేపథ్యంలో తెరకెక్కింది. కానీ కేవలం కంటెంట్‌తోనే భారీ హిట్ సాధించి ఆయనకు దర్శకుడిగా మంచి స్థాయి తీసుకువచ్చింది.

ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్

ఇన్నాళ్లు దర్శకుడిగా అదరగొట్టిన లోకేష్.. ఇప్పుడు హీరోగా మారనున్నారు. దీంతో హీరోగా ఆయన తొలి ప్రాజెక్ట్ పై మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో లోకేష్ సరసన మలయాళీ చిన్నది మిర్నా మీనన్ కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

పూర్తి వివరాలను

మిర్నా మీనన్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. ఆది సాయి కుమార్ క్రేజీ ఫెల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఉగ్రం సినిమాలో కనిపించింది. కానీ ఈ రెండు సినిమాలతో మిర్నాకు అంతగా గుర్తింపు రాలేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. తాజాగా లోకేష్ కనగరాజ్ సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

లోకేష్ కనగరాజ్ మొదటి చిత్రం ఏది?

“నగరం” సినిమా ద్వారా లోకేష్ తన డైరెక్టర్ కెరీర్ ప్రారంభించారు.

ఆయన ప్రసిద్ధ హిట్ సినిమాలు ఏవి?

ఖైదీ, విక్రమ్, జైలర్, కూలీ వంటి సినిమాలతో బాక్సాఫీస్‌లో సంచలనాలు సృష్టించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-i-am-speechless-when-i-see-thaman-balakrishna/cinema/538763/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870