ప్రేమ అనేది మనసు, భావోద్వేగాల మిశ్రమం. ఇది రెండు వ్యక్తుల మధ్య ఉన్న నమ్మకం, మమకారం, పరస్పర గౌరవం మీద నిలిచిన అనుబంధం. అయితే నేటి కాలంలో కొంతమంది యువకులు, యువతులు ప్రేమకు అసలు అర్థాన్నే మార్చేస్తున్నారు. ప్రేమ అంటే ఆనందం, పరస్పర సహకారం, సానుభూతి కాదు, కేవలం ఆలోచనల నుంచి బయటపడని కోపం, ఆత్మహత్య, హత్య వంటి దారుణాలుగా మారుతోంది.ఇలాంటి ఉదాహరణలలో గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఇటీవల భుజ్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనం చీకటిగా నిలిచింది. ఒక యువతి తన మాజీ ప్రియుడు చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తరించిన ఒక చిన్న కారణంతో ప్రారంభమైంది. ఆమె తన మాజీ ప్రియుడిని సోషల్ మీడియా లో బ్లాక్ చేసినందుకు కోపం వచ్చిన అతడు, సగటు బుద్ధితో అర్థం చేసుకోక, దారుణ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మొత్తం ప్రాంతంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రజలు, సమాజం, పోలీసులు, మీడియా ఈ హత్యని తీవ్రంగా ఖండించారు.

పూర్తి వివరాలు
గాంధీధామ్‌లోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువతి భుజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ బీసీఏ చదువుతోంది. అదే కాలనీలో నివసించే 22 ఏళ్ల మోహిత్ సిద్ధపారాతో ఆమె గతంలో ప్రేమలో ఉండేది. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో యువతి తన తల్లి సలహా మేరకు మోహిత్‌ను సోషల్ మీడియా (social media) లో బ్లాక్ చేసింది. దీనిపై ఆగ్రహించిన మోహిత్, తన స్నేహితుడితో కలిసి యువతి చదువుతున్న కళాశాల దగ్గరకు వెళ్లాడు.సంస్కార్ పాఠశాల సమీపంలో ఆమెను అడ్డగించి, సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేశావని గొడవపడ్డాడు. ఇకపై తనను ఇబ్బంది పెట్టొద్దని, మళ్లీ కలవడానికి ప్రయత్నించొద్దని యువతి స్పష్టం చేసింది. ఈ మాటలతో కోపం పట్టలేకపోయిన మోహిత్, ఆమెపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్నేహితుడిని కూడా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ మరుసటి రోజు ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి.. నిందితుడు మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన భుజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: