ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండలంలోని బోయనపల్లె గ్రామానికి వెళ్లి, ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల దరి చేరేలా చేయడం, ప్రతి పౌరుడు నేరుగా లబ్ధి పొందేలా చూడడం ఆయన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కానున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు రూ.2,746.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేయనున్నారు.
మరిన్ని సౌకర్యాలను
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారు. పేదల ఇళ్లకే పింఛన్లు చేరేలా చూడడం ప్రభుత్వ నిబద్ధత అని అధికారులు పేర్కొన్నారు.రాజంపేట (Rajampet) పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దోబీఘాట్‌ను సందర్శించి రజకుల సమస్యలను తెలుసుకోనున్నారు. రజకులకు ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి, మరిన్ని సౌకర్యాలను అందజేయనున్నారు. వారితో నేరుగా సంభాషణ జరిపి వారి జీవనోపాధికి మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.తర్వాత తాళ్లపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం, కొత్తగా అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

తన నివాసానికి
ముఖ్యంగా పేదల సేవలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రతి ఒక్కరికి చేరేలా పథకాలను పారదర్శకంగా అమలు చేస్తామన్న నమ్మకాన్ని కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లతో, పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమవుతారు. సాయంత్రం హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాత పింఛన్లతో పాటు కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారుల కోసం అదనంగా రూ.3.15 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.32,143 కోట్లు కేటాయించిందని, ఇది దేశంలోనే రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం లబ్ధిదారుల జియో-కోఆర్డినేట్స్‌ను కూడా నమోదు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: