హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాట తర్వాత పోలీసులు అప్రమత్తమై బాలుడిని పక్కకు తీసుకెళ్లిన సీపీఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి గత 56 రోజులుగా శ్రీతేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్న శ్రీతేజ్.. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవటంతో వెంటిలేటర్‌ను తొలగించి గదికి తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ్ ఆసుపత్రి బెడ్‌కే పరిమితం కాగా.. తాజాగా డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం బాలుడు పేరుపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడటం లేదని అన్నారు. ఎవర్ని గుర్తించటం లేదని.. నోరు విప్పి ఏం మాట్లాడటం లేదని తెలిపారు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. తమ సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నట్లు వెల్లడించారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని చెప్పారు. ఎప్పుడు కోలుకుంటాడో కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీతేజ్ బాడీలోని ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగానే ఉన్నాయన్నారు. అయినా.. బాలుడి నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ డాక్టర్లు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ వెల్లడించారు. కాగా, శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. వైద్యానికి ఆర్థిక సాయం కూడా అందించారు. హీరో అల్లు అర్జున్ బాలుడిని పరామర్శించటమే కాకుండా వైద్యానికి అవసరమైన డబ్బులు అందజేశారు. పు