కొన్ని ప్రేమలు జీవితాలను మార్చే శక్తి కలిగివుంటే, మరికొన్ని ప్రేమలు పూర్తిగా కూల్చేస్తాయి. అలాంటి విషాదం తాజాగా తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా (Jagityala District) లోని వెల్గటూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కిషన్ రావు పేట కు చెందిన సల్లూరి మల్లేశ్ (26) అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను తరచూ వెంటాడుతూ, ప్రేమ వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి తీవ్ర అసహనం కలిగించాడు. ఈ వ్యవహారంపై యువతి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, తద్వారా మల్లేశ్‌పై నాలుగు కేసులు నమోదు కావడం జరిగింది.ఇంతలో మూడేళ్ల క్రితం కూడా మల్లేశ్‌పై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మల్లేశ్ (Mallesh) అందుకు సంబంధించి యువతి తండ్రి రాజిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. అప్పట్నుంచి కుటుంబాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.

కూతురికి పెళ్లి సెటిలైన క్రమంలో మల్లేశ్
ఈ క్రమంలోనే, మల్లేష్ యువతి ఇంటికి వెళ్లాడు, దీంతో యువతి ఆమె తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు తండ్రి రాజిరెడ్డి, మరో ఇద్దరితో కలిసి వెల్గటూర్ పెద్దవాగు వంతెన సమీపంలో కాపు కాశాడు. స్థానికులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులంతా అక్కడినుంచి పారిపోయారు. కాసేపటికే, కిలోమీటర్ దూరంలో ఉన్న పాత వైన్స్ షాప్ వెనుక, మల్లేశ్ కత్తిపోట్లకు గురై విగతజీవిగా పడి కనిపించాడు.కూతురికి పెళ్లి సెటిలైన క్రమంలో మల్లేశ్ ఇంకా కూడా వెంటపడుతుండటంతో భరించలేకే తండ్రి రాజిరెడ్డి (Rajireddy) అతన్ని చంపినట్లు పేర్కొంటున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. మల్లేశ్ తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు రాజిరెడ్డితో పాటు, మరో ఇద్దరిపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. మల్లేశ్ ది పరువు హత్యే, అని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల ప్రత్యేకత ఏమిటి?
జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం లోని ఉత్తర భాగంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇది అనేక కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది.జగిత్యాల కోట,వ్యవసాయం,గ్రానైట్ & పరిశ్రమలు,విద్యా, వైద్య కేంద్రం,బస్సు డిపో, ట్రాన్స్‌పోర్ట్.
భారతదేశంలో ప్రధాన ఐదు పంటలు ఏమిటి?
భారతదేశంలో పెంచబడే ముఖ్యమైన ఐదు పంటలు ఇవే,బియ్యం (Rice),గోధుమ (Wheat),సిరిధాన్యాలు (Millets),పప్పు ధాన్యాలు (Pulses),కాఫీ, టీ (Coffee & Tea).
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mudragada Padmanabham: వైసీపీ సీనియర్ నేత ముద్రగడకు తీవ్ర అస్వస్థత