Land scam took place in Amaravat.. Botcha Satyanarayana

అమరావతిలో జరిగింది భూ స్కాం : బొత్స సత్యనారాయణ

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పాం అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు. మేము 2014 నుంచి మాట్లాడాలని అడిగాం. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగాం విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పాం.

Advertisements
అమరావతిలో జరిగింది భూ స్కాం

ప్రభుత్వానికి దశ, దిశా లేదు

ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయనని కోరుతున్నాం. ప్రభుత్వానికి దశ, దిశా లేదు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం కదా. డిజిటల్ కరెన్సీ పై మాట్లాడారు.. అది సరైనది కాదు. మాపై వచ్చిన ఆరోపణలు మేం ఖండించడం లేదు.. సమర్ధించడం లేదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నాం. మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారు.

ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం

సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పాం. అమరావతిలో జరిగింది భూ స్కాం. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు మేం సిద్ధం అర్థం లేని ఆరోపణలు చేస్తే మేం సమాధానాలు చెప్పలేం. వైసీపీ మీద.. మా నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే మేం సభ నుంచి వాకౌట్ చేశాం అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Related Posts
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 12 మంది మావోయిస్టుల మృతి
Massive encounter in Chhatt

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు Read more

పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు
పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బల్లియా జిల్లా, ఉభావోన్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.కొత్త కారుకు పూజ చేసేందుకు కుటుంబం దేవాలయానికి వెళ్లగా, ఏడాదిన్నర వయసున్న చిన్నారి Read more

Nara Lokesh : లోకేశ్ కుటుంబం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు
Nara Lokesh లోకేశ్ కుటుంబం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు

Nara Lokesh : లోకేశ్ కుటుంబం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి పంజాబ్ పర్యటనలో భాగంగా అమృత్‌సర్‌లో Read more

సంక్రాంతి సినిమాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
pongal movies

సంక్రాంతి బరిలో ఒకటి , రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సిని మాలు బరిలోకి దిగుతున్నాయి. ముందుగా శంకర్ - రామ్ చరణ్ కలయికలో దిల్ Read more