हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

‘లైలా’ సినిమా రివ్యూ

Ramya
‘లైలా’ సినిమా రివ్యూ

యూత్‌ ఐకాన్‌గా పేరొందిన కథానాయకుడు విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించి హైలైట్‌గా నిలిచారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి ఈ సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రారంభ వసూళ్లు మరియు పబ్లిసిటీ చూస్తే, లేడీ గెటప్‌తోనే సినిమాకు ప్రయోజనం చేకూర్చాలని భావించిన దర్శకుడు రామ్ నారాయణ ఈ చిత్రాన్ని విఫలంగా మార్చేశాడు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి ఈ సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది.

picture52 1739286689

కథ: అమ్మ తనకు ఇచ్చిన జ్క్షాపకంగా, వారసత్వంగా భావిస్తూ హైదరాబాద్‌లోని పాతబస్తీలో సోను (విష్వక్‌ సేన్‌) బ్యూటీ పార్లర్‌ను నడిపిస్తుంటాడు. పాతబస్తీలోని ఆడవాళ్లందరూ సోను బ్యూటీ పార్లర్‌కే వస్తుంటారు. అలా తన పార్లర్‌కు వచ్చిన ఓ లేడి కస్టమర్‌కు బిజినెస్‌ కోసం ఆర్థిక సహాయం చేయడమే కాక, వాళ్లు చేస్తున్న కుకింగ్‌ ఆయిల్‌ బిజినెస్‌కు అంబాసిడర్‌గా తన ఫోటోను కూడా ప్రచారంలో వాడుకోమని చెబుతాడు. మరో వైపు ఆ ప్రాంతంలో మటన్‌ బిజినెస్ చేస్తున్న రుస్తుమ్‌ (అభిమన్యు సింగ్‌)కు పెళ్లి కాకుండా బాధపడుతుంటే, సోనూ తన పార్లర్‌లో మేకప్‌తో అందంగా తయారు చేసిన ఓ అమ్మాయి (కామాక్షి భాస్కర్ల)ను చూసి రుస్తుమ్‌ పెళ్లి చేసుకుంటాడు.

అయితే శోభనం జరిగిన మరుసటి రోజే ఆమె అందం కేవలం మేకప్‌తోనే వచ్చిందని, సోను తనను మోసం చేశాడని అనుకుంటాడు రుస్తుం. దీంతో పాటు రుస్తుం పెళ్లి వంటల్లో వాడిన నూనె ద్వారా ఫుడ్‌ పాయిజన్‌ అయి పెండ్లికి వచ్చిన వారందరూ ఆస్పత్రిలో జాయిన్‌ అవుతారు. సోను ఈ ఆయిల్‌ కంపెనీకి అంబాసిడర్‌గా ఉండటంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలుపెడతారు. పోలీసుల నుండి, రుస్తుం నుండి తప్పించుకోవడానిక సోను లేడి గెటప్‌లోకి లైలాగా మారిపోతాడు. ఆ తరువాత ఏం జరిగింది? లేడి గెటప్‌ లైలాగా సోను ఏం చేశాడు? తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెరపై చూడాలి.

నటీనటుల పనితీరు

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సోను పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ, లేడీ గెటప్‌లో తన పాత్రలో అద్భుతంగా ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమాలో హీరోయిన్‌ను కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేశారు. ఇతర పాత్రల ప్రదర్శనలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో ఎమోషనల్ అనుభవాలు మరియు వినోదం లేకుండా, సినిమాను చలనచిత్రంగా చూడటం అసాధ్యం అయ్యింది.

విశ్లేషణ:
ఈ కథలో ప్రయోజనాన్ని చూపించడానికి, సినిమా సన్నివేశాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలాంటి ఓ కథను సినిమాగా తీస్తానంటే నిర్మాత, హీరో విష్వక్‌ సేన్‌ ఎలా ఒప్పుకున్నాడు అనిపించేంత నాసిరకమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించడానికి మాత్రమే ఈ సినిమా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి కథలు ముందుగా మన చిత్రసీమలో చూసినప్పటికీ, ఈ చిత్రంలో నిజంగా ఎలాంటి పర్ఫెక్ట్ సబ్జెక్ట్‌ లేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870