Lagacharla incident. Accused in police custody for two days

లగచర్ల ఘటన.. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీల

హైదరాబాద్‌: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటునకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

దీంతో పరిగి పీఎస్‌లో సురేష్‌ను ఈరోజు, బుధవారం పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్‌కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు..చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్‌ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగించారు. దాడిలో గిరిజనులను ఎందుకు రెచ్చగొట్టారు, దానివెనుకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – జగన్
jagan tpt

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Read more

రష్యా-నార్త్ కొరియా సైనిక ఒప్పందం: యుద్ధ సామగ్రి, రక్షణ రాకెట్ల సరఫరా..?
troops north korea

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మద్దతు ఇచ్చేందుకు నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకు పంపినప్పటి నుండి, రష్యా కొరియాకు వాయు రక్షణ రాకెట్లు సరఫరా చేసినట్లు దక్షిణ కొరియా Read more

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ
Bill Gates meets Sachin Tendulkar

Sachin Tendulkar: భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ గురువారం నాడు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా Read more

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్
singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా Read more