Lagacharla incident. Accused in police custody for two days

లగచర్ల ఘటన.. నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీల

హైదరాబాద్‌: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటునకు వ్యతిరేకంగా అక్కడి గ్రామస్తులు వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

Advertisements

దీంతో పరిగి పీఎస్‌లో సురేష్‌ను ఈరోజు, బుధవారం పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్‌కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు..చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్‌ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసముండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగించారు. దాడిలో గిరిజనులను ఎందుకు రెచ్చగొట్టారు, దానివెనుకున్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts
ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు
earthquake

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా Read more

ట్రంప్‌ను కెనడాలోకి బ్యాన్‌ చేయాలి: జగ్మీత్‌ సింగ్‌
Trump should be banned from Canada.. Jagmeet Singh

ట్రంప్‌పై గతంలో నేర నిర్ధరణ ఒట్టావా : కెనడా ప్రతిపక్ష ఎన్‌డీపీ (నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ) నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్‌ సింగ్‌ బుధవారం జగ్మీత్‌ సింగ్‌ Read more

కొత్త పార్టీ పెట్టబోతున్న నహీద్ ఇస్లాం
Nahid Islam new party

బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ Read more

భూముల రీ-సర్వే.. గ్రామసభల్లో 41వేల ఫిర్యాదులు
Re survey of lands. 41 tho

ఆంధ్రప్రదేశ్ లోని భూములపై రీ-సర్వే నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ఇప్పటి వరకు 41,112 ఫిర్యాదులు అందాయి. భూ విస్తీర్ణాల తగ్గింపు, పత్రాల్లో తప్పులు, చనిపోయిన వారి పేర్ల Read more