సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్.ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదల కానుండగా, ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాత దిల్‌రాజు హాజరయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమ
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీని దేశంలోనే ది బెస్ట్ అని ప్రశంసించారు.తెలుగు ప్రేక్షకులు నటీనటులను గౌరవించే విధానం నన్నెంతో ఆకట్టుకుంది. నా 47 ఏళ్ల సినీ కెరీర్‌లో అనేక మంది తెలుగు నటులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను, అని తెలిపారు.అలాగే, తన మలయాళ చిత్రాలు గతంలో తెలుగులో రీమేక్ అయ్యాయని, అయితే ఇప్పుడు తమ సినిమా నేరుగా తెలుగు భాషలో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
50 రోజుల విజయోత్సవం
ఎల్2: ఎంపురాన్’ చిత్రంపై మోహన్ లాల్, ఈ సినిమాను రూపొందించడానికి మేము రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డాం. ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతున్నాను”, అని అన్నారు.మేము 50 రోజుల విజయోత్సవాన్ని తెలుగు ప్రేక్షకులతో కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాం”, అని ధీమా వ్యక్తం చేశారు.

లూసిఫర్2
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. 2019లో వచ్చిన లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లకి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేశారు.
క్రేజీ ప్రాజెక్ట్
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. తమ సంస్థ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇదని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ప్రత్యేక అనుభూతిని అందిస్తుందన్నారు.’ఎల్2: ఎంపురాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.మోహన్ లాల్ – పృథ్వీరాజ్ కలయికలో మళ్లీ మేజిక్ రిపీట్ అవుతుందా?లూసిఫర్ సీక్వెల్.. కథలో ఏం మారబోతోంది?
తెలుగులో డైరెక్ట్‌గా విడుదల కావడం వల్ల రీస్పాన్స్ ఎలా ఉండబోతోంది?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మార్చి 27న థియేటర్లలో తెలుస్తుంది. మోహన్ లాల్ మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? అని ప్రేక్షకులు ఆశక్తి గా ఎదురుచూస్తున్నారు.