ktr quash petition rejected in supreme court

కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్‌ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను వేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు రాగా.. కాసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్‌కు నిరాశే ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.

image
image

విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిదార్థ వాదనలు వినిపించారు. ఈ ఫార్ములా కారు రేసు కేసులో హెచ్‌ఎండీఏను, ఇతరులను పేర్కొనలేదని కేవలం ఇద్దరు అధికారులను, కేటీఆర్‌ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. వెంటనే జోక్యం చేసుకున్న జస్టిస్ బేలా త్రివేది.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్‌కు ఎదురుదెబ్బే తగిలింది. సుప్రీం నిర్ణయంతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

అయితే కేటీఆర్‌ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ను ముందస్తుగానే దాఖలు చేసింది. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్ నిరాకరణకు గురైనప్పటికీ.. సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌లో తాము జోక్యం చేసుకునేదని లేదని సుప్రీం దర్మాసనం తేల్చిచెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ డిస్మిస్ అయిన నేపథ్యంలో.. మాజీ మంత్రి అరెస్ట్‌ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ను ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.

Related Posts
రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు కేటాయింపు – కిషన్ రెడ్డి
kishan reddy warning

యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి Read more

ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలు..

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. Read more

జగన్ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్
nimmala

పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ లాగా వాడుకున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలకు Read more

ఇళయరాజా ఇంటికెళ్లిన సీఎం స్టాలిన్
cm stalin met ilayaraja

సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, మార్చి 8వ తేదీన లండన్‌లో ఘనమైన సింఫనీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆసియా ఖండానికి Read more