KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా
కాగా, కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ నిలిచారు.
దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది
కాగా, చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొని.. డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియచెప్పిన సంగతి తెలిసిందే. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.