ktr comments on congress government

కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే చార్జీలు పెంచి జనంపై భారం మోపేందుకు రెడీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేసిందన్నారు. ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేనని ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే?. మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Related Posts
ట్రంప్ సంచలన హామీలు
ట్రంప్ సంచలన హామీలు

డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రసంగంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటానని, దేశ సరిహద్దులపై జరుగుతున్న దండయాత్రను ఆపుతానని హామీ Read more

కమ్మేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం
Over 100 flights delayed due to heavy fog

న్యూఢిల్లీ: చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, పంజాబ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత Read more

లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి
లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసిన వనౌటు ప్రధానమంత్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో పరారీలో ఉన్నారు. తన హయాంలో ఆయనపై కోట్ల రూపాయల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. Read more

వీడిన రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు మిస్టరీ
rajalinga murthy murder

తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు మీద ఉన్న మిస్టరీ దర్యాప్తుతో ముక్కణి పెరిగింది. భూపాలపల్లి పోలీసులు ఆరు బృందాలతో చేపట్టిన దర్యాప్తులో ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *