ktr comments on congress government

కోతలు, కూతలు కాదు చేతలు కావాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న ప్రకటనలపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని, ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను.. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్లు తెరవాలని సూచించారు. వర్షం కురుస్తుందో లేదో, సాగునీరు, కరంటు, పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో.. లేదో? అని తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాలన్నారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూపొద్దన్నారు. పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పారని, అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు వెతుకుతున్నారని కేటీఆర్‌ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు.

Related Posts
సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్
అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.గురువారం అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ తన నివాసంలో ఈ Read more

Kavitha: తెలంగాణ అప్పు రూ.4,37,000 కోట్లు మాత్రమే : కవిత
Telangana debt is only Rs. 4,37,000 crore.. Kavitha

Kavitha : నేడు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల Read more

CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy to leave for Delhi this afternoon

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ Read more

వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ
RK Roja meet with YS Jagan

గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్ అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి Read more