ktr comments on congress

కాంగ్రెస్‌ పాలనలో ఒరిగింది ఏమిటీ..?: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

Advertisements
image

రుణ‌మాఫీ, రైతు భ‌రోసా, సాగునీళ్లు, క‌రెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిష‌న్ కిట్, తులం బంగారం, మ‌హాల‌క్ష్మి రూ. 2500, ఆస‌రా పెన్ష‌న్లు, రూ. 5 ల‌క్ష‌ల విద్యా భ‌రోసా కార్డు, జాబ్ క్యాలెండ‌ర్, ఏడాదిలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, విద్యార్థినుల‌కు స్కూటీలు, తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు రూ. 25 వేల పెన్ష‌న్, ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, రైతుల‌కు రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం, భూమి లేని రైతుల‌కు సైతం రైతు బీమా, నిరుద్యోగుల కోసం యూత్ క‌మిష‌న్.. రూ. 10 ల‌క్ష‌లు వ‌డ్డీ లేని రుణం, నిరుద్యోగ యువ‌త‌కు నెల‌కు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు రూ. 12 ల‌క్ష‌ల ఆర్థిక సాయం, ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం, క‌మిషన్, ఆర్టీసీ విలీన ప్రక్రియ, ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేలు, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్‌నెట్‌, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలకు రేవంత్ రెడ్డి స‌ర్కార్ క‌టింగ్ పెట్టింద‌ని కేటీఆర్ తెలిపారు.

200 యూనిట్లు ఉచిత కరెంట్ క‌టాఫ్‌, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతుకూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ఆఖరుకు ఇందిరమ్మ ఇళ్లకు కటాఫ్, పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు కటాఫ్ ఎందుకు..? అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు..? డ‌బుల్ బెడ్రూంలకు మూడు రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అని కేటీఆర్ విమ‌ర్శించారు. జాగో తెలంగాణ జాగో అని కేటీఆర్ నిన‌దించారు.

Related Posts
Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి
Bharat : భారత్-పాక్ సైనిక శక్తి పోలికలో భారతదే పైచేయి

భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాశ్మీర్‌లో పెహల్‌గాం ప్రాంతంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందగా, భారత Read more

Classification of SC : తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు
CNG Classification of SC

తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం నేటితో సఫలమైంది. దాదాపు 30 ఏళ్లుగా ఎస్సీ సామాజిక వర్గాలు ఈ వర్గీకరణ కోసం Read more

శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి
Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా Read more

హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో, ఆయన Read more

Advertisements
×