ktr comments on cm revanth reddy

ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం: కేటీఆర్‌

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా రేవంత్ వైఖరీ ఉందని ఆక్షేపించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్విట్ చేశారు.

image
image

‘‘తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? – తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు..? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ.. ? – ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ..? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ..? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ..? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నారు. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా..? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్‌నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం’’ అని కేటీఆర్ విమర్శించారు.

Related Posts
కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరిక
Karimnagar Mayor Sunil Rao2

కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో మేయర్ సునీల్ రావు కాషాయ కండువా Read more

ఇంకా మారకపోతే మార్చురీకి పోతారు: కవిత
kavitha comments on cm revanth reddy

హైరదాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు Read more

భూసేకరణపై హైకోర్టులో తెలంగాణకు ఊహించని షాక్
భూసేకరణపై హైకోర్టులో తెలంగాణకు ఊహించని షాక్

తెలంగాణ రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి నడిచిన హైకోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్‌ను ఇచ్చింది. లగచర్ల మరియు హకీంపేట ప్రాంతాలలో జరుగుతున్న భూసేకరణపై హైకోర్టు స్టే Read more

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం
AP Cabinet కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

AP Cabinet : కేబినెట్ భేటీ ముగిశాక చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం Read more