గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ వార్త‌ను ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ‘ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?’ అంటూ కేటీఆర్ షేర్ చేశారు. ఆటోడ్రైవ‌ర్ల‌కు ఇస్తాన‌న్న రూ.12వేల సాయం ఏమైంద‌ని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు. ఆటో డ్రైవ‌ర్ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌ను మోస‌గించార‌ని ఆయ‌న‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!” అని కేటీఆర్ అన్నారు. “ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధ‌గ ధ‌గ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను సీఎం మోసగించారు..అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆటోవాలాలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తమ పక్షాన కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇకపై ఎవరూ అలాంటి పనులు చేయొద్దని భరోసానిచ్చారు. మీ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Related Posts
ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Green signal for replacemen

ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత Read more

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
pawan lokesh

బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు Read more

ఈ సంవత్సరం ఉద్యోగాలలో నియమించబడిన 10% మంది ఉద్యోగుల ఉద్యోగ శీర్షికలు 2000లో లేవు..కనుగొన్న లింక్డ్ఇన్ యొక్క వర్క్ చేంజ్ స్నాప్‌షాట్‌
10 of Employees Hired in Jobs This Year Had Job Titles That Didnt Exist in 2000 LinkedIns Work Change Snapshot Finds

· భారతదేశంలోని 82% వ్యాపార నాయకులు కొత్త విధులు , నైపుణ్యాలు మరియు సాంకేతికతలకు డిమాండ్ పెరుగుతున్నందున పనిలో మార్పుల వేగం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. · Read more

తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
mayonnaise

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ఒక సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *