గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ వార్త‌ను ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ‘ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?’ అంటూ కేటీఆర్ షేర్ చేశారు. ఆటోడ్రైవ‌ర్ల‌కు ఇస్తాన‌న్న రూ.12వేల సాయం ఏమైంద‌ని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు. ఆటో డ్రైవ‌ర్ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌ను మోస‌గించార‌ని ఆయ‌న‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!” అని కేటీఆర్ అన్నారు. “ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధ‌గ ధ‌గ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను సీఎం మోసగించారు..అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆటోవాలాలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తమ పక్షాన కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇకపై ఎవరూ అలాంటి పనులు చేయొద్దని భరోసానిచ్చారు. మీ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Related Posts
కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!
కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!

ఫార్ములా-ఈ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) కె.టీ. రామారావు (కేటీఆర్), బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కి 6 జనవరి ఉదయం 10 గంటలకు Read more

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం..
condoled the death of sm krishna

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్యం రిత్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే Read more

ఫ్యూచర్‌ సిటీలో 56 గ్రామాలు ఎక్కడంటే?
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ – రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ దక్షిణ భాగంలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దీనిలో Read more

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *