విజయవాడ: ప్రతి ఇంటికి ఒక వ్యాపారి ఉండేలా చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ దిశగా బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్లు కీలక పాత్ర పోషించాలని ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీనివాస్ కొండపల్లి తెలిపారు. ఆయన సురంపల్లి ఏఎల్ ఏపి ఇండస్ట్రియల్ ఎస్టేట్ (AP Industrial Estate)లో బుధవారం జరిగిన బిడిఎస్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమని చెప్పారు. బిడిఎస్ ప్రొవైడర్లు సాంకేతిక సలహాలు, వ్యాపార సలహాలు, మార్కెట్ లింకేజీలు అందించి పారిశ్రామికవేత్తలకు తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా 53 మంది బిడిఎస్ ప్రొవైడర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అంతేకాకుండా బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ట్రైనింగ్ మాన్యువల్ ను ఆవిష్కరించారు.

ఏఎస్ఈఏపి తో ఒప్పందం
ఏపీ ఎంఎస్ఎంఈ (MSME)డెవలప్మెంట్ కార్పొరేషన్ అమలు సంస్థగా ఏఎస్ఈఏపి తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఐదుగురు చొప్పున మొత్తం 1,200 మంది బిడిఎస్ ప్రొవైడర్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో భాగంగా కుప్పంలో మహిళలకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తున్న ఏఎస్ఈఏపి ప్రయత్నాన్ని మంత్రి ప్రశంసించారు. అదే విధంగా విజయనగరంలో కూడా ఇలాంటి ఎస్టేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సర్ఫ్ సీఈఓ వి. కరుణ, ఏఎస్ఈఏపి అధ్యక్షురాలు రమా దేవి కన్నెగంటి, స్కిల్ డెవలప్మెంట్ సెల్ వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ఫ్ ఏఎస్ఈఏపి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా గ్రామీణ పారిశ్రామిం “వేత్తలు, స్వయంసహాయక సంఘాలకు సాంకేతిక జ్ఞానం, శిక్షణ, వ్యాపార సంబంధాలు లభిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: