హైదరాబాద్: ఏపీలో ఏడు మండలాలు కలవడంతోనే భద్రాచలం (Bhadrachalam) దేవాలయ భూములు వివాదం తలెత్తిందని, ఇది చాలా రోజులుగా నడుస్తోందని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయి. చాలా రోజుల నుంచి వారికి నచ్చజె బుతున్నాం.. కానీ ప్రతిసారి గొడవలు జరుగు తూనే ఉన్నాయి.. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు.

భద్రాద్రి రాముడి భూమి ఆక్రమణ
దీనిపై ఏపీలో కేసు నమోదు (Case registered in AP) చేయాల్సి ఉందని, అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేద న్నారు. ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని, ఈ అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభు త్వానికి లేఖ రాశామన్నారు. ఏపీతో మాట్లాడా లని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం రిక్వెస్ట్ చేశామన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూము లున్నాయి. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భద్రాచలం టెంపుల్ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో ఆ గ్రామస్థులతో తరచూ ఘర్షణ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా.. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉందని, పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంద న్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి కాని వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణన లోకి తీసుకోవటం లేదన్నారు .
మంత్రి కొండా సురేఖ గారి నియోజకవర్గం?
ఆమె ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో శ్యాంపేట మరియు పరివర్తన తరువాత పారకల అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఆమె ప్రాతినిధ్యం వహించారు.
కొండా సురేఖ భర్త ఎవరు?
వ్యక్తిగత జీవితం. కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మరియు కాంగ్రెస్ నాయకుడు కొండా మురళిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Adulterated Toddy: చెట్లు లేకున్నా.. రసాయనాలతో ‘కల్తీ’ కల్లు!