తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

Advertisements
తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

మూలమూర్తికి ప్రత్యేక పూజలు

ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవత మూర్తులు, పూజ సామాగ్రిని శుద్ధి చేశామని వివరించారు. మూలమూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ మొత్తం సంప్రోక్షణ చేశామని కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు అర్చకులు సమర్పిస్తారని ఈవో తెలిపారు.

image

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధకారులు రద్దు చేశారు. 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు తెలియజేశారు. 30న ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts
KCR: పాకిస్థాన్ పై పదేళ్ల క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నేడు వైరల్
KCR: పాకిస్థాన్‌పై కేసీఆర్ పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశాన్ని తీవ్రంగా కుదిపేసింది. అమాయకులైన పౌరులు, పర్యాటకులు లక్ష్యంగా జరిగిన ఈ దారుణ ఘటనలో 26 Read more

అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!
High prices

ప్రజల ఆదాయంలో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, మాంసం వంటి అన్ని నిత్యావసరాలు కొండెక్కాయి. రాష్ట్రంలోని సాధారణ కుటుంబాలకు Read more

హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..
Hindupuram Municipality won by TDP

అమరావతి: హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. Read more

IPL 2025:1307 పరుగులతో రెండో స్థానంలో ఓపెనర్ సాయి సుదర్శన్
IPL 2025:1307 పరుగులతో రెండో స్థానంలో ఓపెనర్ సాయి సుదర్శన్

ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించారు.బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×