Kodali Nani Resign news

రాజీనామా వార్తలపై కొడాలి నాని క్లారిటీ

వైసీపి లో రాజీనామా పర్వాలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎంతోమంది పార్టీకి , పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చేయగా..తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం పలు చర్చలకు దారి తీసింది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

Advertisements

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తారని, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అవుతారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు వైసీపీ కార్యకర్తల మధ్య కలకలంగా మారాయి. ఈ ప్రచారంపై కొడాలి నాని స్వయంగా స్పందించారు. తాను వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే వార్తలు కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై జరుగుతున్న ఈ ప్రచారాన్ని కొడాలి నాని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. ఇది ఎడిటెడ్ న్యూస్ అని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చని కొడాలి నాని ఆందోళన వ్యక్తం చేశారు. తాను వైసీపీతో కొనసాగుతానని, ప్రజల సేవకు మద్దతుగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Related Posts
హైడ్రాకు మరో అధికారం..
hydraa ranganadh

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం Read more

Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో?
Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో?

Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో? బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌లో హిందూ భార్యాభర్తలు ఆఫీసు పని ముగించుకుని ఇంటికి తిరిగి Read more

అమరావతి పనుల పరిశీలనకు ఐఐటీ నిపుణులు
amaravathi 600 11 1470895158 25 1477377675 27 1493286590

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐదు ఐకానిక్ టవర్ల పనులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. గతంలో నిర్మాణ పనులు నిలిచిపోవడంతో, ఈ ప్రాజెక్ట్ Read more

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ భారీ కటౌట్

RRRతో గ్లోబల్ స్టార్ అయినా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన Read more